రవితేజ ‘రాజా’ సెంటిమెంట్ ను నమ్ముకుంటున్నారా?. చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. ఈ మాస్ హీరో నటించిన రాజా ది గ్రేట్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజా సినిమా అమర్ అక్భర్ అంటోనీ బాగా నిరాశపర్చింది. శనివారం నాడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘డిస్కో రాజా’ టైటిల్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
టైటిల్ లోగో ఆసక్తికరంగా ఉంది. వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రవితేజకు జోడీగా ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.