విజయ్ దేవరకొండకు తప్పిన పెనుప్రమాదం

Update: 2018-12-17 10:51 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు వరస హిట్లతో దూసుకెళుతున్న యువ హీరో విజయ్ దేవరకొండకు పెను ప్రమాదం తప్పింది. నడుస్తున్న రైలులో ఎక్కాల్సిన విజయ్ పట్టు తప్పి కిందకు పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కొంత మంది విజయ్ ను పక్కకు లాగటంతో ప్రమాదం తప్పింది. ఓ షూటింగ్ లో భాగంగా ఈ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. కాకినాడ రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి పరుగెడుతూ వచ్చి రైలు ఎక్కాల్సి ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విజయ్ కు చిన్న చిన్న గాయాలు అయ్యాయి.

Similar News