ఆసక్తికరంగా ఎన్టీఆర్ ‘టైటిల్ సాంగ్

Update: 2018-12-23 13:00 GMT

‘నువ్వు రాముడేషమే కట్టావంటే గుండెలు అన్నీ గుడులైపోతాయే. నువ్వు కృష్ణుడల్లె తెరమీదకు వస్తే వెన్నముద్దల్లే కరిగెను హృదయాలే. ఆ దేవుడు దేవుడు ఎదురొచ్చినా దేవుడుకాదంటాం. ఎందుకనీ అడిగాడో..ఎన్టీఆర్ పోలిక ఒకటీ లేదంటాం. ’అంటూ సాగిన ఎన్టీఆర్ టైటిల్ సాంగ్ ఎన్నో కీలక ఘట్టాలను సృశించింది. ఆ పాట నిజంగా ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుదనటంతో ఎలాంటి సందేహం లేదు.

ఈ టైటిల్ సాంగ్ లో ఎన్టీఆర్ పాత సినిమాలకు సంబంధించి చిత్రాలను ఉపయోగించారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ కు కూడా విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ టైటిల్ సాంగ్ కూడా అదరగొడుతుంది. రెండు భాగాలు వస్తున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర తొలి భాగం జనవరి9న విడుదల కానున్న విషయం తెలిసిందే.

https://www.youtube.com/watch?time_continue=2&v=8uG0sNrs5O4

Similar News