కెసీఆర్..సీఎంగా రెండో సారి

Update: 2018-12-13 08:35 GMT

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నాం సరిగ్గా 1.25 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కెసీఆర్ సీఎంగా రెండవసారి ప్రకారస్వీకారం చేసినట్లు అయింది. గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కెసీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. కెసీఆర్ తోపాటు మహబూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు కానుంది. అది కూడా వచ్చే వారంలో పూర్తి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇఫ్పటివరకూ అయితే ఈ నెల18న మంత్రివర్గ ఏర్పాటు ఉండొచ్చని సమాచారం. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

తొలుత కేసీఆర్‌ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ప‍్రచారం జరిగినప్పటికీ, మహమూద్‌ అలీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ 2014 జూన్‌ 2న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా గవర్నర్‌ నరసింహనే కేసీఆర్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం కొత్తగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం జరగ్గా..అందులో టీఆర్‌ఎస్‌ శాసనసభపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.

 

Similar News