మమతా..కెసీఆర్ ‘ఫెడరల్’ చర్చలు

Update: 2018-12-24 15:39 GMT

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు వేగవంతం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు కోల్ కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అయ్యారు. తాను ఒక మిషన్ తో వెళుతున్నానని..అది ఇప్పటికిప్పుడు తేల్చేంత చిన్న విషయం కాదని..ఒక పక్కా ప్లాన్ ప్రకారం సాగుతున్నామని తెలిపారు. త్వరలోనే శుభవార్త అందిస్తామన్నారు కెసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

ఆదివారం నాడు ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశం అయ్యారు. సోమవారం నాడు మమతా బెనర్జీతో భేటీ అయిన అనంతరం కెసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జాతీయ రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. మమతాతో భేటీ అనంతరం కెసీఆర్ మీడియాతో మాట్లాడారు. దీదీతో చర్చలు సానుకూలంగా సాగాయన్నారు. రాబోయే రోజుల్లోనూ చర్చలు కొనసాగించి పూర్తి స్థాయి ఫలితాలు రాబడతామని పేర్కొన్నారు.

Similar News