తిరుమలలో హరీష్ రావు

Update: 2018-12-17 14:59 GMT

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అప్రతిహత విజయం సాధించిన తర్వాత మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు జోరు తగ్గినట్లు కన్పిస్తోంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెటీఆర్ ను నియమించటంతో ఆయనే పార్టీలో కీలక నేతగా ఆవిర్భవించారు. ఈ నియామకాన్ని హరీష్ స్వాగతించి..కెటీఆర్ కు సహకరిస్తానని ప్రకటించారు. అయితే తాజా పరిణామాలపై హరీష్ సన్నిహితుల్లో ఏదో తెలియని అసంతృప్తి నెలకొంది.

సిద్ధిపేట ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో విజయం సాధించిన హరీష్ రావు సోమవారం నాడు తిరుమలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా హరీష్ రావు తిరుమల వచ్చారు. గత ప్రభుత్వంలో హరీశ్‌రావు భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ సహా పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. కేసీఆర్‌ త్వరలో ఖరారు చేయనున్న తన మంత్రివర్గంలో హరీశ్‌కు తాజాగా ఏ మంత్రిత్వశాఖ కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తిరుమలలో హరీష్ కు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్మానం చేశారు.

Similar News