‘118’ టీజర్ విడుదల

Update: 2018-12-18 05:55 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమానే 118. ఈ టైటిల్ ను ఖరారు చేయటం ద్వారానే చిత్ర యూనిట్ ప్రేక్షకుల అటెన్షన్ డ్రా చేసింది. జనవరిలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజర్ లో మాత్రం షాలిని పాండే, కళ్యాణ్ రామ్ ల సీన్లే కన్పిస్తున్నాయి. టీజర్ ప్రకారం ఈ సినిమా ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ సినిమాకు కె వి గుహన్ దర్శకత్వం వహించారు.

https://www.youtube.com/watch?time_continue=17&v=YorrwXf0mfI

Similar News