భయపెట్టాలంటే పది నిమిషాలు..చంపేయాలంటే పావుగంట. ఏది కావాలో నువ్వు సెట్ చేసుకో. నువ్వు పందెం పరశురామ్ అయితే ఏందిరా..నేను రామ్..కొ..ణి..దెల అంటూ రామ్ చరణ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగులతో ‘వినయ విధేయ రామ’ సినిమా టీజర్ వచ్చేసింది. చిత్ర యూనిట్ శుక్రవారం నాడు ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో కూడా బోయపాటి శ్రీను మార్క్ సీన్లు కన్పించాయి. ఈసినిమా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అందుకు తగ్గట్లే టీజర్ లోనూ రిచ్ నెస్ స్పష్టంగా కన్పించింది.
రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. దీపావళి కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 49 సెకన్ల ఈ టీజర్‌ను మాస్ యాక్షన్ సీన్స్‌తో పవర్ ప్యాక్డ్ గా రెడీ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
https://www.youtube.com/watch?v=lanFp3Yw9YU