2.ఓ సినిమా సెన్సార్ పూర్తి

Update: 2018-11-20 08:57 GMT

శంకర్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా 2.ఓ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాకు సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అన్ని సినిమాల కంటే 2.ఓ నిడివి అతి తక్కువ అట. ఈ సినిమా కేవలం 2.28 గంటలు మాత్రమే ఉండనుంది. రోబో 167 నిమిషాలతో అతి నిడివి సినిమాగా ఉంటే ‘ఐ’ సినిమా మాత్రం 188 నిమిషాలు ఉంది.

ఐ సినిమాలో విక్రమ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. 2.ఓ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇఛ్చింది. ఈ సినిమాలో అమీ జాక్సన్ రజనీకాంత్ కు జోడీగా నటించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. భారత దేశ చిత్ర పరిశ్రమలోనే అత్యధికంగా అంటే 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో లైకా సంస్థ ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

Similar News