గో..గో...గోవా

Update: 2018-11-03 04:27 GMT

మళ్ళీ గోవా పర్యాటక సీజన్ వచ్చేసింది. ప్రతి పర్యాటక ప్రాంతానికి ఓ సీజన్ ఉంటుంది. అనువైన సీజన్ లో ఆయా ప్రాంతాలను సందర్శిస్తేనే అసలైన అనుభూతులను పొందవచ్చు. దేశంలోని పర్యాటకులు సీజన్ తో సంబంధం లేకుండా ఎవరికి అనువైనప్పుడు వారు గోవాను సందర్శిస్తూ ఉంటారు. కానీ గోవా సందర్శనకు అనువైన సమయం నవంబర్ నుంచి మొదలై మార్చి వరకూ కొనసాగుతుంది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక బీచ్ లకు నిలయం అయిన గోవాను ఎక్కువ మంది మాత్రం నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లోనే సందర్శిస్తారు. క్రిస్మస్ సమయం, న్యూయర్ సమయంలో అయితే విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్ద ఎత్తున గోవాకు చేరుకుంటారు. దీని కోసం బడా బాబులు ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ గోవాలో వాలిపోతారు. ఈ సమయంలోనే ఎక్కువ మంది పర్యాటకులు గోవా సందర్శనకు వస్తారు కాబట్టి..హోటళ్ళు, రిసార్ట్ ల ధరలు కూడా ఈ సమయంలో అధికంగా ఉంటాయి. అంతే కాదు..క్యాబ్ ఛార్జీలూ ఈ సీజన్ లోనే ఎక్కువ.

కాకపోతే ముందే ప్లాన్ చేసుకుని గోవాకు వెళితే మాత్రం ఆ బీచ్ ల అందాలను ఆస్వాదించటానికి ఇదే సరైన సమయం. దేశంలోనే ‘క్యాసినో’లు ఉన్న ఏకైన ప్రాంతం గోవానే. నూతన సంవత్సరం సందర్బంగా అక్కడ జరిగే వేడుకలు దేశంలోనే హైలైట్ గా ఉంటాయనటంతో అతిశయోక్తి లేదు. సినీ సెలబ్రిటీలు..పారిశ్రామికవేత్తలు..సంపన్నులు చాలా మంది తమ నూతన సంవత్సర వేడుకలను గోవాలో జరుపుకునేందుకు ముందే ప్లాన్ చేసుకుంటారు. అయితే ఏ బడ్జెట్ వారికి ఆ బడ్జెట్ కు అనుగుణంగా ఉండే సౌకర్యాలు గోవాలో అందుబాటులో ఉంటయి. సో..మీరూ కూడా గో..గో..గోవా అంటూ బయలుదేరండి మరి.

 

 

Similar News