షాపింగ్ ఫెస్టివల్ సీజన్ కు దుబాయ్ రెడీ

Update: 2018-12-19 04:15 GMT

పర్యాటకులకు ఈ సీజన్ ఎంతో ప్రత్యేకం. ఓ వైపు క్రిస్మస్ వేడుకలు..మరో వైపు నూతన సంవత్సరానికి స్వాగత ఏర్పాట్లు. అదీ దుబాయ్ లో అయితే ‘షాపింగ్ ఫెస్టివల్’ సందడి. ఈ సారి కూడా మెగా సందడికి దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ రెడీ అయింది. డిసెంబర్ 26న ప్రారంభం అయ్యే ఈ అతి పెద్ద షాపింగ్ ఫెస్టివల్ 2019 ఫిబ్రవరి 2 వరకూ కొనసాగనుంది. అంటే దాదాపు రెండు నెలల పాటు ఈ సందడి సాగనుందన్న మాట. నిజంగా ఈ సమయంలో దుబాయ్ సందర్శించిన వారికి ప్రత్యేక అనుభూతులు ఖాయం. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి పర్యాటకులు ఈ సమయానికి దుబాయ్ చేరుకుంటారు. షాపింగ్ ప్రేమికులకు అయితే ఇది ఓ స్వర్గథామం అనే చెప్పొచ్చు. షాపింగ్ సమయంలో అదృష్టవంతులు ఖరీదైన బహుమతులు గెలుచుకునేందుకు వీలుగా అక్కడ ఆఫర్లు కూడా ఉంటాయి.

షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా గ్లోబల్ విలేజ్ లైవ్ సందర్శనలు...దుబాయ్ ఓపెరా వద్ద నూతన సంవత్సర వేడుకలు ఇలా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకులు..సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఫ్రతి ఏటా ఈ సీజన్ లో లక్షలాది మంది పర్యాటకులు ప్రత్యేకంగా దుబాయ్ పర్యటనకు వస్తారు. వీరి కోసం అక్కడి హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తాయి. అయితే రెగ్యులర్ సమయంతో పోలిస్తే ఈ సమయంలో విమాన టిక్కెట్లు మొదలుకుని...హోటళ్ళ వ్యయం కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. అయితే క్రిస్మస్...న్యూయర్ హడావుడి ముగిసిన తర్వాత అయితే కొంత అందుబాటులో ధరలతో విమాన టిక్కెట్లు...హోటల్ గదులు దొరికే అవకాశం ఉంటుంది.

 

 

Similar News