‘పెద్దలకు మాత్రమే’...ప్రత్యేక హోటల్స్

Update: 2019-09-11 04:32 GMT

పెద్దలకు మాత్రమే. మనకు తెలిసి ఇది కేవలం సినిమా ప్రేక్షకులకు మాత్రమే వర్తించే నిబంధన. అది కూడా కొన్ని సినిమాలకు మాత్రమే. కానీ ఇఫ్పుడు కొన్ని హోటల్స్ ‘పెద్దలకు మాత్రమే’ అని చెబుతున్నాయి. పిల్లలు ఉంటే వాళ్ళను ఆ హటల్ లోకి అనుమతించరు. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒక్క గోవాలో మాత్రమే ఈ తరహా హోటల్ ఒకటి మాత్రమే ఉంది. హోటల్ నిర్వాహకులు ‘పెద్దలకు మాత్రమే’ ఎందుకు అన్న నిబంధనపై పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్యాగ్ లైన్ వల్ల కొత్తగా పెళ్ళైన వారు..హానీమూన్ ట్రిప్స్ కు వచ్చేవారిని ఆకట్టుకోవచ్చనేది వారి ప్లాన్. అదే సమయంలో చిన్న పిల్లల వల్ల నిర్వాహకులు చాలా సందర్భాల్లో ఇబ్బందులు కూడా వస్తున్నాయంట. స్టార్ హోటల్ కారిడార్స్ లో పిల్లలు గోలగోల చేస్తూ ఆడుకోవటం..పలు వస్తువులను చిందరవందర చేయటం వంటి అంశాలను వీళ్ళు ప్రస్తావిస్తున్నారు.

ఆన్ లైన్ లో హోటల్ గదులను సెర్చ్ చేసే వాటిలో ఉచిత వైఫై ,కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ అనేది ఎంత కీలక అంశం అయిందో...‘పెద్దలకు మాత్రమే’ అనుమతించే హోటల్స్ అనే సెర్చ్ ఆప్షన్ కూడా అంత కామన్ గా మారిందని గుర్తించారు. ముఖ్యంగా విదేశాల్లో ఈ కాన్సెప్ట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఏకాంతంగా ఉండాలనుకునేవారికి..హానీమూన్ లకు వచ్చేవారిని ఆకట్టుకునేందుకు పలు హోటల్స్ ఇప్పుడు ఈ మోడల్ ను ఫాలో అవుతున్నాయి. గోవాలోని బాగా నది పక్కన ఉన్న పార్క్ హోటల్ ఇదే ట్యాగ్ లైన్ తో ఏకంగా 85 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో సాగుతోంది. ఇక్కడ కేవలం 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని మాత్రమే అనుమతిస్తారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది.

 

 

Similar News