తెలుగు బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి ప్రేక్షకులు కాస్త మనసారా నవ్వుకున్న స్కిట్ ఏదైనా ఉంది అంటే అది శుక్రవారం రాత్రి ప్రసారం అయిందే. అమ్మాయిలకు అబ్బాయి ఓ అద్దంగా మారటం అనే కాన్సెప్ట్ ఆకట్టుకుంది. అద్దం క్యారెక్టర్ కు అవినాష్ ను ఎంచుకోవటంలోనే ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అద్దం ముందు అమ్మాయిలు ఎంత సేపు సమయం వెచ్చిస్తారో తెలిసిందే. అయితే ఆ సమయంలో అద్దం మనోభావాలు ఎలా ఉంటాయో అవినాష్ చెప్పిన తీరు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది అని చెప్పాలి. బిగ్ బాస్ లోని మహిళా సభ్యులు అవినాష్ ముందు కూర్చుని అద్దంతో మాట్లాడిన తీరు..వాటికి అవినాష్ ఇచ్చిన కౌంటర్లు నవ్వులు పూయించాయి. ఫస్ట్ ఫస్ట్ స్వాతి దీక్షిత్ అవినాష్ ముందుకు వచ్చింది. అద్దం ముందు అలా ఇలా చూసుకుని మొహం ఎందుకు ఇంతగా ఉబ్బుతోంది అంటూ అడుగుతుంది. దీనికి అద్దంగా వ్యవహరించిన అంతంత తింటే మొహం ఉబ్బక ఏమి చేస్తుంది అని ప్రశ్నిస్తాడు.
అవీ ఇవీ మాట్లాడి ఓవర్ అయిందా అని అడిగితే..నాకు బోర్ కొడుతుంది..అద్దం పగలిపోయింది అంటూ అవినాష్ లేచిపోతాడు. దివి కి లిప్ స్టిక్ పూసుకోవాలి కానీ..తినకూడదు అంటూ అవినాష్ ఝలక్ ఇస్తాడు. సుజాతకు కూడా అవినాష్ గట్టి కౌంటర్లే ఇచ్చాడు. రోల్డ్ గోల్డ్ వేసుకుని..గోల్డ్ లా ఫీల్ అవుతుంది. దయచేసి నీకు దణ్ణం పెడతా..ఇంకోసారి నవ్వకే అంటూ సుజాతను ఏడిపిస్తాడు. లాస్య అద్దం ముందుకొచ్చి ...అయ్య బాబోయ్..నాకు నేనే ఎంత ముద్దొస్తున్నానో... ఎంత అందంగా ఉన్నానో...ఎన్నిసార్లు అబద్దం ఆడతావు అంటూ అవినాష్ కౌంటర్ ఇస్తాడు. మళ్ళీ వారు నాకు పడిపోతాడంటావా అని అద్దాన్ని ప్రశ్నిస్తే ..ఆయన ఫస్ట్ టైమ్ కే ఫీల్ అవుతున్నాడు..మళ్ళీనా అంటూ షాకిస్తాడు. అద్దానికి ఇంత పెద్ద ముక్కు ఉంటుందా అని అవినాష్ కు ఝలక్ ఇస్తుంది గంగవ్వ.
https://www.youtube.com/watch?v=qURbJ2rkfRQ