విమానంలో విండో సీటు అడిగితే...!

Update: 2018-11-16 09:30 GMT

చాలా మంది విమానంలో విండో సీటు కోరుకుంటారు. కొత్తగా ప్రయాణించే వారికి అయితే ఈ కోరిక మరీ ఎక్కువ. ఎందుకంటే గాలిలో అలా ఎగురుకుంటూ పోతూ..బయట కన్పించే అందమైన దృశ్యాలు..దట్టమైన మేఘాలు..మబ్బులను చూసి ఆస్వాదిస్తుంటారు కొందరు. అయితే నిత్యం విమానాల్లో ప్రయాణించే వారు మాత్రం ఇవేమీ పెద్దగా పట్టించుకోరు. కొంత మంది అయితే అలా ఫ్లైట్ టేకాఫ్ అవ్వగానే హాయిగా అలా నిద్రలోకి జారుకుంటారు. చాలా మంది విమాన ప్రయాణాన్ని రెస్ట్ కు కూడా వాడుకుంటారు. ఇదంతా వేరే కథ.

జపాన్ కు వెళ్లే ఓ ప్రయాణికుడు తనకు విండో సీటు కావాలన్నాడు. ప్రస్తుతం విమానంలో విండో సీటు కేటాయించటం సాధ్యంకాదని చెప్పిన ఎయిర్ హోస్టెస్ ఏమి చేసిందో తెలుసా?. చూస్తే మీరూ అవాక్కు అవుతారు. ఓ కాగితం మీద విండో బొమ్మ వేసి..అందులో మేఘాలను కూడా జొప్పించి ఆ షీట్ ను విండో సీటు అడిగిన ప్రయాణికుడి సీటు పక్కన అంటించింది. ప్రస్తుతం ఈ వార్త..ఫోటో వైరల్ గా మారింది.

 

 

Similar News