టీఆర్ఎస్ కు ఓటు వేయవద్దు..వేయించవద్దు

Update: 2018-11-05 04:58 GMT

కాలేజీ విద్యార్ధులతో ప్రతిజ్ణ

అది ఏ కాలేజీనో తెలియదు. ఎక్కడో తెలియదు. కానీ ఈ వీడియో మాత్రం వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. అసలే ఎన్నికల సమయం. ఎవరూ ఏ అవకాశాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు చాలా వరకూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. అందులో భాగంగా ఏకంగా కాలేజీ క్లాస్ రూమ్ ల్లోనే విద్యార్ధులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిజ్ణలు చేయించాయి. అదేంటో మీరూ ఓ సారి చూడండి.

‘ఎన్నో ఆశలతో.. అమరుల త్యాగాలతో, ప్రజలందరూ విద్యార్ధులు, నిరుద్యోగులు అంతా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తన నిరంకుశత్వ పాలనతో అందరినీ నమ్మించి, మోసం చేసి భ్రష్టు పట్టించిన ప్రత్యేకించి విద్యా రంగాన్ని నాశనం చేసిన కెసీఆర్ ను గద్దెదించాలని..మేమంతా, మా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సహా టీఆర్ఎస్ కు ఓటు వేయం అని..వేయించబోమని మనస్పూర్తిగా ప్రమాణం చేస్తున్నాం.’ తీర్మానం చేయించారు. ఈ సమయంలో కొంత మంది విద్యార్దులు నవ్వాపుకోలేకపోయిన దృశ్యాలు వీడియోలో చూడొచ్చు.

https://www.facebook.com/vasireddy.srinivas.31/videos/1851023365008889/

Similar News