ఆ టీజర్ హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఉంది. కానీ అది తెలుగు సినిమానే. ఈ చిత్ర దర్శకుడు ఎవరో తెలుసా?. ఒకే ఒక్క చిత్రం ‘ఘాజీ’తో అందరి దృష్టిని ఆకర్షించిన సంకల్ప్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో వరుణ్ తేజ్, అదితి రావు హైదరీ జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ బుధవారం నాడు టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ చూడటంతోనే ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. హై టెక్నికల్ వాల్యూస్, హాలీవుడ్ నిపుణుల సారధ్యంలో యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా వరుణ్ కెరీర్ లోనే కీలక చింత్రంగా మారే అవకాశం కన్పిస్తోంది.
జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించగా, డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంది. తెలుగులో పూర్తిస్థాయి ‘అంతరిక్షం’ నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇదే. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఘాజీ తరహాలోనే రికార్డులు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది.
https://www.youtube.com/watch?v=hn024grhDFY