ఎన్టీఆర్ ను రెడ్డీ ఇక్క‌డ చూడు అంటున్న పూజా

Update: 2018-10-09 13:19 GMT

అదేంటి అలా ఎందుకు పిలుస్తున్నారు అంటారా?. ఈ పాట చూస్తుంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలో రాయ‌ల‌సీమ రెడ్డిగా న‌టించిన‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. ఎందుకంటే ఏకంగా పాట‌లోనే రెడ్డీ ఇటు అంటూ హీరోయిన్ పూజా హెగ్డె సంద‌డి చేస్తుంది. ఈ పాట ప్రొమోను చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసింది. ఇందులో ఎన్టీఆర్

త‌న‌దైన శైలిలో డ్యాన్స్ దుమ్మురేప‌గా..సెట్టింగ్ ల రిచ్ నెస్ కూడా అదిరిపోయేలా ఉంది. సినిమా విడుద‌ల‌కు ఇంకా కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే ఉండ‌టంతో ప్ర‌తి పాట ప్రొమోల‌ను వ‌ర‌స‌గా విడుద‌ల చేసుకుంటూ వ‌స్తున్నారు.

ఇవి ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహ‌న్ని నింపుతున్నాయి. ఇప్ప‌టికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అర‌వింద ఫీవ‌ర్ వ‌చ్చేసింది. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా రెండు అద‌న‌పు షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌టంతో అభిమానులంతా తొలి షో చూసే ఏర్పాట్ల‌లో మునిగిపోయారు. ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ఈ సినిమా ఎన్ని రికార్డులు న‌మోదు చేస్తుందో వేచిచూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=lhMF7NBuE00

Similar News