ఆరు గంటలు నిద్రపోతే ‘రివార్డు’

Update: 2018-10-23 04:24 GMT

ఈ ఆఫర్ ఏదో బాగుంది..ట్రై చేద్దామనుకుంటున్నారా?. ఆగండి..ఆగండి. ఇది ఇక్కడ కాదు సుమా. జపాన్ కు చెందిన ఓ పెళ్ళిళ్ల నిర్వాహక కంపెనీ తన ఉద్యోగులకు ఈ వెరైటీ ఆఫర్ ఇచ్చింది. రాత్రి వేళ్లలో ఎవరు అయితే కనీసం ఆరు గంటలు నిద్రపోతారో వారే దీనికి అర్హులు. వారంలో కనీసం ఐదు రోజులు అయినా రాత్రిళ్ళు కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. ఇలా నిద్రపోయి పాయింట్లు దక్కించుకున్న వారు కంపెనీ కాఫెటేరియాలో 40 వేల రూపాయల విలువైన ఫుడ్ కూపన్లు పొందవచ్చట.

ఏడాది పాటు వీటిని వాడుకోవటానికి అవకాశం కల్పిస్తారు. అయితే సదరు ఉద్యోగులు నిజంగానే ఆరు గంటలు నిద్రపోతున్నారా?. లేదా అన్నది తెలుసుకోవటం ఎలా అనుకుంటున్నారా?. నో ప్రాబ్లమ్..దానికీ ఓ యాప్ ఉంది. అదే ‘ఎయిర్ వీవ్’. ఈ యాప్ ను మ్యాట్రెసెస్ ఫ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సిద్ధం చేయించింది. జపాన్ లో ఇలాంటి వెరైటీ పోటీలు కూడా ఉంటాయా?. ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా జపాన్ లో ఉద్యోగులు నిద్రపోయే సమయం చాలా తక్కువ అట. కొన్ని కంపెనీలు ఆఫీస్ డెస్క్ లపైనే ఓ 20 నిమిషాల పాటు పవర్ నాప్ కు అనుమతి కూడా ఇస్తాయట.

 

 

Similar News