సముద్రంలో పెళ్ళి..వేదికైన ముంబయ్-గోవా క్రూయిజ్

Update: 2018-10-22 06:14 GMT

పెళ్లిళ్లు ఎన్నో రకాలు. డెస్టినేషన్ వెడ్డింగ్. గాలిలో పెళ్లి. సముద్రంలో పెళ్లి. ఇప్పుడు సముద్రంలో పెళ్లి భారత్ లో కూడా జరిగింది. అది కూడా కొత్తగా ప్రారంభం అయిన ముంబయ్-గోవా క్రూయిజ్ లో. ఆ జంట కూడా ముంబయ్ కు చెందిన జంటే. ప్రబీర్, సయాలీ కొర్రాలు కొత్తగా ప్రారంభం అయిన ఈ లగ్జరీ క్రూయిజ్ ‘అంగ్రియా’లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. దీంతో సముద్రంలో పెళ్లి చేసుకున్న జంటగా వీళ్లు నిలుస్తారని క్రూయిజ్ కెప్టెన్ ప్రకటించారు.

దేశంలో తొలి లగ్జరీ క్రూయిజ్ లో ఈ పెళ్ళి జరగటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత శనివారం నాడే ఈ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ముంబయ్ నుంచి గోవాకు వెళ్ళే ఈ క్రూయిజ్ పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని ఇవ్వనుంది. పైగా ఇప్పుడు గోవాకు పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే సీజన్ కూడా. ఈ క్రూయిజ్ లో స్టార్ హోటల్ ను తలదన్నేలా విలాసవంతమైన సౌకర్యాలను ప్రయాణికులకు అందించనున్నారు. అయితే ఈ ఛార్జి కాస్త ఎక్కువగానే ఉంటుంది.

 

Similar News