అరవింద సమేత వీరరాఘవ సినిమాతో ఎన్టీఆర్ ‘రికార్డులు’ బద్దలు కొడుతున్నారు. అమెరికా మార్కెట్లతో పాటు దేశీయంగానూ ఈ సినిమా కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ చేసిన సినిమాలు నాలుగు వరసగా 1.5 మిలియన్ డాలర్ల వసూళ్ళను అధిగమించింది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ సినిమాలు కూడా 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా తాజాగా అరవింద సమేతతో మరోసారి అదే రికార్డ్ అందుకున్నాడు.
ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం విశేషం. అరవింద సమేత ఇప్పటి వరకు దాదాపు 1.7 మిలియన్ డాలర్ల (12 కోట్ల 50 లక్షల) వసూళ్లు సాధించింది. అంతే కాదు..ఇప్పటికే వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. దీంతో దర్శకుడు హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఫుల్ కుషీలో ఉన్నారు.