ర‌వితేజ కొత్త సినిమా టీజ‌ర్ గురూ

Update: 2018-10-29 13:18 GMT

న‌వంబ‌ర్ నెల సినిమాల పండ‌గ‌లా ఉంది. ప‌లు కొత్త సినిమాలు ఈ నెల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. అందులో ర‌వితేజ హీరోగా న‌టించిన ‘అమర్, అక్బర్, ఆంటొని’ కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు విడుద‌ల చేసింది. చాలా గ్యాప్ త‌ర్వాత ఇలియానా ర‌వితేజ తో జోడీ క‌ట్టింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా న‌వంబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ‘‘మనకు నిజమైన ఆపదొచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన

చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం’’. అనే డైలాగ్ తో టీజ‌ర్ ప్రారంభం అవుతుంది. టీజ‌ర్ లుక్ చాలా రిచ్ నెస్ తో ఉంది. ఈ చిత్రంలో రవితేజ మూడు పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవివశంకర్, మోహన్ (సీవీఎమ్) విడుద‌ల‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

https://www.youtube.com/watch?v=VYuI6USrGuE

Similar News