2.ఓ ట్రైలర్ డేట్ వచ్చేసింది

Update: 2018-10-28 15:52 GMT

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.ఓ ట్రైలర్ తేదీ వచ్చేసింది. నవంబర్ 3న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పింది. మరి ట్రైలర్ ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ లు కీలకపాత్రలు పోషించారు. ఎన్నో వాయిదాల అనంతరం ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రోబోకే సీక్వెల్ గానే ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

Similar News