వైసీపీలో టిక్కెట్ల కలకలం

Update: 2018-09-17 16:15 GMT

ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలో టిక్కెట్ల కలకలం ప్రారంభం అయింది. పలు జిల్లాల్లో ఇప్పటి నుంచే పంచాయతీలు మొదలయ్యాయి. సీట్ల సర్దుబాటు వైసీపీ అధినేత జగన్ కు కూడా పెద్ద తలనొప్పిగా మారనుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఈ తలనొప్పి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. వైసీపీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ను మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తుంటే..ఆయన అందుకు ససేమిరా అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి..వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలన్నది రాధా ఆశగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సామాజికపరంగా..రంగా తనయుడికి వైసీపీ అధికారంలోకి వస్తే తనకు కేబినెట్ లో ఛాన్స్ దక్కతుందని ఆయన ఆశిస్తున్నారు.

అందుకు భిన్నంగా ఎంపీ సీటుకు ఆయన పేరు ప్రతిపాదించటంతో రాధాతో ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాధాతో పాటు ఆయన అనుచరులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. విజయవాడ సెంట్రల్ సీటును మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై వంగవీటి రాదా వర్గీయులు తర్జనభర్జన పడుతున్నారు. అసంతృప్తితో ఉన్న రాధాతో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు మరికొంత మంది నేతలు చర్చలు జరిపారు.

 

 

 

Similar News