మరో బహిరంగకు సభకు రెడీ అయిన టీఆర్ఎస్

Update: 2018-09-04 10:58 GMT

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వరస పెట్టి బహిరంగ సభలకు రెడీ అవుతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ లో ఈ నెల7న బహిరంగ సభ నిర్వహించనుంది. మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులు మంగళవారం నాడు బహిరంగ సభ సభాస్థలి వద్ద టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. ప్రజల ఆశీర్వాద సభ పేరుతో దీన్ని నిర్వహించనున్నారు. అసెంబ్లీ రద్దు అయిన మరుసటి రోజే బహిరంగ సభకు శ్రీకారం చుట్టడం ద్వారా కెసీఆర్ ప్రజలకు ఇలాంటి సందేశం ఇవ్వనున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 2న నిర్వహించిన సభపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అయినా సరే మరో సభ ద్వారా ప్రజల్లోకి పార్టీ వైఖరిని పంపాలని నిర్ణయించుకున్నారు. సీఎం కెసీఆర్ 50 రోజుల్లో వంద నియోజకవర్గాల్లో పర్యటించటం ద్వారా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. ఈ నెల6న అసెంబ్లీ రద్దుకు కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

 

Similar News