‘అచ్చం’ చంద్రబాబులా రానా

Update: 2018-09-12 14:20 GMT

రానా భలే సెట్ అయ్యారు. అచ్చం చంద్రబాబులానే ఉన్నారు. ఈ లుక్ చూసిన వారెవరైనా ఇదే మాట అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో రానా చంద్రబాబు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రానా న్యూ లుక్ ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇవి హల్ చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రక కథలతో చిత్రాలను తెరకెక్కించటంలో అనుభవం ఉన్న క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు హావభావాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల క్రితమే రానా అమరావతి వెళ్లి చంద్రబాబుతో సమావేశం కూడా అయ్యారు. వినాయక చవితి సందర్భంగా రానా కొత్త లుక్ విడుదల చేశారు. ఎన్ బికే ఫిలింస్‌, వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2019 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

 

 

Similar News