బస్సు 56 మందిని చంపేసింది

Update: 2018-09-11 09:06 GMT

ఓ బస్సు 43 మంది ప్రాణాలు తీసేసింది. బస్సెక్కి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుతామని అనుకుంటుండగానే అనుకోని దుర్ఘటన. ఈ ఘటనలో ఏకంగా 56 మంది మృత్యువాత పడ్డారు. ఊహించని పరిణామంతో బస్సులో ఉన్న వారంతా ద్రిగ్భాంతికి గురయ్యారు. షాక్ తోనే ఎక్కువ మంది మరణించారనే వార్తలు వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏకంగా 56 మంది చనిపోయారు. మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను జగిత్యాల, కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. బస్సు కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 88 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. పరిమితికి ిమించి బస్సులో ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాధానికి కారణం అని నిగ్గుతేల్చారు.

కొండగట్టు ఘాట్‌ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్న సమయంలో బ్రేక్‌ ఫెయిల్‌ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు. సహాయక చర్యల్లో స్థానికులు నిమగ్నమయ్యారు. బస్సులో పరిమితికి మంచి ప్రయాణికులు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు ఒక పక్కకు ఒరిగిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడి ఊపిరి ఆడక పిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం కెసీఆర్ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సును నడిపిన డ్రైవర్ ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్ అవార్డును పొందారు. ఈ ప్రమాదంలో ఆయన కూడా మరణించారు. రెగ్యులర్ రూట్ లో కాకుండా..అడ్డదారిలో వెళ్లటం కూడా ప్రమాదానికి కారణం అని చెబుతున్నారు.

 

 

Similar News