తెలంగాణలో తగ్గిన 20 లక్షల ఓట్లు

Update: 2018-09-05 10:33 GMT

ఓట్లను ఆధార్ తో అనుసంధానం చేయటం..కొంత మంది ఏపీకి వెళ్లటం వల్ల తెలంగాణలో ఓట్లు 20 లక్షల మేర తగ్గాయి. ఆధార్ తో అనుసంధానం వల్ల బోగస్ ఓట్లు చాలా వరకూ పోయాయని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేవలం ఊహాగానాలే వినిపిస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం నాడు సచివాలయంలో అన్ని పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. ఒకవేళ శాసనసభను రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఆయన చెప్పారు.

షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను తాము కొనసాగిస్తున్నామని... అందులో భాగంగానే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించినట్లు రజత్ కుమార్ తెలిపారు. రాష్ట్రానికి 84వేలకు పైగా వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లు, లక్షా 23వేల బ్యాలెట్ యూనిట్లు అవసరమని... ఈసీఐఎల్ లో అవి సిద్ధమవుతున్నాయని చెప్పారు. 2014లో 2 కోట్ల 81 లక్షల ఓట్లు ఉండగా...తాజాగా వాటి సంఖ్య 2 కోట్ల 61 లక్షలకు పడిపోయింది.

 

 

Similar News