రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికపై మాటమార్చిన వైసీపీ

Update: 2018-08-09 07:00 GMT

‘రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు వేస్తాం’. ఇదీ కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య. ఈ మాట ఎవరూ అడగక ముందే ఆయన చెప్పారు. కానీ తీరా ఎన్నిక సమయానికి వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ చేశారు. ఓటింగ్ కు దూరంగా జరిగారు. అంటే ఇది పరోక్షంగా అధికార బిజెపికి సహకరించటమే. గురువారం నాడు జరిగిన ఎన్నికలో వైసీపీతోపాటు మరికొన్ని పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉండే ఎన్టీయే అభ్యర్ధి హరిశంశ్ నారాయణ్ విజయం సాధించారు.

బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్నప్పుడు ప్రత్యర్ది ఎవరు అనేది చూడకూడదు. కానీ వైసీపీ మాత్రం ఏపీకి కాంగ్రెస్, బిజెపి అన్యాయం చేశాయి కాబట్టే తాము దూరంగా ఉన్నామని ఇప్పుడు చెబుతున్నారు. మరి కొద్ది రోజుల క్రితం ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఎందుకు ప్రకటించినట్లు?. వైసీపీ వరసగా చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీ నేతలు..క్యాడర్ ను విస్మయానికి గురిచేస్తున్నాయి.

 

Similar News