జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడుదల

Update: 2018-08-14 09:41 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఓ వైపు ప్రత్యర్ధి పార్టీలపై రాజకీయ విమర్శల దాడి పెంచుతూ...మరో వైపు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ను మంగళవారం నాడు విడుదల చేశారు. భీమవరం మావుళ్లమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఈ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఈ తొలి ప్రతిని కార్యకర్తకు అందజేశారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికలకు ఇది పార్టీపరంగా దార్శనిక పత్రం అని పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు...

  1. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
  2. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
  3. రేషన్ కు బదులు మహిళల ఖాతాల్లో నెలకు రూ. 2500 నుంచి 3500 వరకు జమ,
  4. బీసీలకు అవకాశాన్ని బట్టి ఐదు శాతం రిజర్వేషన్లు పెంపుదల
  5. బీసీలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు
  6. కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
  7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం

8.ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్గాల విద్యార్ధులకు వసతి గృహాలు

  1. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు
  2. ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు
  3. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు
  4. అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు

 

Similar News