రాష్ట్రాన్ని ఒక రాష్ట్రానికి ఇచ్చారు

Update: 2018-08-09 09:36 GMT

ఇదీ ఏపీ పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య. రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ గుంటూరు జిల్లా మాచర్ల పర్యటనలో లోకేష్ ఈ వింత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఒక రాష్ట్రానికి ఇచ్చారు అని వ్యాఖ్యానించి అక్కడ సమావేశానికి హాజరైన వారందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ఇది ఒక్కటే కాదు..ఇలాంటి వింత వ్యాఖ్యలు ఎన్నో ఉన్నాయి. ‘నియోజకవర్గం వచ్చినప్పుడు అందరికీ చేతులు ఇవ్వటం అలవాటు. దాదాపు ఓ ఐదుగురు గట్టిగా గీసేశారు. మొత్తం గీరేశారు ఏ మిగల్లా?.అక్కడనే అర్థమైపోయింది..ఇక్కడున్న కసీ...మీలో ఉన్న కసి చూస్తుంటే నాకెలాంటి సందేహం లేదు. 2019లో మాచర్లలో పసుపు జెండా ఎగరబోతోంది.’ అని లోకేష్ ప్రకటించారు. లోకేష్ చేతులు గీయటానికి...మాచర్లలో టీడీపీ గెలవటానికి సంబంధం ఏమిటో?. ఆ లాజిక్ బహుశా ఆయన అక్కడికే తెలియాలి మరి.

ఈ లెక్కన అన్ని నియోజకవర్గాల్లో నారా లోకేష్ తిరిగి తన చేతిని కార్యకర్తలకు ఇఛ్చి గీరేలా చేసుకుంటే ఇక టీడీపీకి తిరుగుతుండదన్నట్లే లెక్క. ఇక ఆయా నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు...పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అంతే కాదు..తాను పది గంటలకే ఇంటి కెళితే...చంద్రన్న పదకొండు గంటలకు ఇంటికొచ్చారట. ఇదంతా ఎవరి కోసం?. ప్రజల కోసం కష్టపడుతున్నారంట. ఇదీ నారా లోకేష్ స్పీచ్. ఇవీ చాలు..టీడీపీని వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరాలు చేర్చటానికి.

నారా లోకేష్ అద్భుతమైన స్పీచ్ ఈ లింక్ లో ఉంది వినండి

 

https://www.youtube.com/watch?v=Z8TdOMUIi2I

Similar News