ఎన్టీఆర్ ఇంట్లో..ఎన్టీఆర్ సినిమా

Update: 2018-08-17 04:28 GMT

అదేంటి అనుకుంటున్నారా?. అవును హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఒకప్పుడు నివాసం ఉన్న ఇంట్లోనే ప్రస్తుతం ఆయన బయోపిక్ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ గా నటిస్తున్న బాలకృష్ణ, చంద్రబాబు పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి రానాలకు చెందిన సన్నివేశాల షూటింగ్ ఆ నివాసంలో జరుగుతోంది. క్రిష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాక ఈ సినిమాకు సంబంధించిన పాత్రల ఎంపిక చకచకా చేసుకుంటూ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు.

ఆగస్టు 15న విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్ కూడా ఆకట్టుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రకు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ను సెలక్ట్ చేశారు. అక్కినేని పాత్రలో సుమంత్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి పాత్రకు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నా..చిత్ర యూనిట్ ఇంత వరకూ వీటిపై అధికారికంగా స్పందించలేదు.

 

 

Similar News