ఎనర్జిటిక్ హీరో రవితేజ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటించిన అమర్, అక్బర్..అంటోని సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
గతంలో రవితేజ, ఇలియానా జంటగా నటించిన సినిమాలు ఎన్నో విజయవంతం అయ్యాయి. మరి ఈ కొత్త పాత కాంబినేషన్ ఎలా వర్కవుట్ అవుతుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ పెట్టింది.