తమన్నాకు పెళ్లంటూ వచ్చిన వార్తలకు మిల్కీబ్యూటీ క్లారిటీ ఇఛ్చేసింది. నేను ఏమైనా భర్తను షాపింగ్ చేస్తున్నానా? అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా హెచ్చరిక స్వరంతో వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వార్తలు ఎవరు..ఎలా పుట్టిస్తారో అర్థం కావటం లేదంటూ మండిపడ్డారు. ఫస్ట్ నటుడు అన్నారు..తర్వాత క్రికెటర్..అది కూడా అయిపోయింది..ఇప్పుడు డాక్టర్ అంటున్నారు...ఇది ఏమైనా షాపింగా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తాను సినిమాలను మాత్రమే ప్రేమిస్తున్నానని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి పెళ్ళి సంబంధాలు చూడటం లేదన్నారు. ఇలాంటి ఆదారరహిత వార్తలు రాయటం సరికాదన్నారు. తాను పెళ్లి చేసుకునే సమయంలో స్వయంగా స్వయంగా తెలియజేస్తానని తెలిపారు. ఆధారాలు లేకుండా వార్తలు రాయటం గౌరవప్రదమైన పనికాదని ఘాటుగానే పుకార్లకు చెక్ చెప్పేశారు ఈ భామ.