స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ

Update: 2018-07-11 04:53 GMT

 

మొన్న కత్తి మహేష్..నేను స్వామి పరిపూర్ణానంద. నగర బహిష్కరణకు గురయ్యారు. సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఈ మధ్యే ఓ ఛానల్ చర్చలో పాల్గొంటూ రాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయటం...టీవీ ఛానల్ పై హిందూ సంస్థలు దాడికి ప్రయత్నించటటం చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో కత్తి మషేష్ ను నగరం నుంచి ఆరు నెలల పాటు బహిష్కరిస్తూ డీజీపీ మహేందర్ ప్రకటన చేశారు. అయితే కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ నుంచి యాదగురిగుట్ట వరకూ దర్మాగ్ర యాత్ర అంటూ తలపెట్టారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతే కాకుండా బుధవారం ఉదయమే స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు.

బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ గృహ నిర్బంధంలో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ తరలించారు. అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించొద్దని.. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు సందర్భాల్లో ఇతర మతాలపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కత్తి మహేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయితే...పరిపూర్ణానంద ఎప్పుడో చేసిన వ్యాఖ్యలపై ఇఫ్పుడు చర్య తీసుకోవటం రాజకీయ కోణంలోనే అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులపై నగరం నుంచి బహిష్కరణ వేటు వేశారు.

 

 

Similar News