‘శ్రీనివాస కళ్యాణం’ కాన్సెప్ట్ ఇదే

Update: 2018-07-19 08:46 GMT

హీరో నితిన్...రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న సినిమానే ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ సినిమా ఎలా ఉండబోతుందో మూడు ముక్కల్లో చెప్పేశారు జయసుధ. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ టీజర్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. అందులో జయసుధ చెప్పిన మాటలు చూస్తే ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన దిల్ రాజు నిర్మాతగానే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు వేగ్నేశ సతీష్ దర్శకుడిగా ఉన్నారు.

‘మనం పుట్టినప్పుడు మనవాళ్లంతా సంతోషిస్తారు. ఆ విషయం మనకు తెలియదు. మనం చనిపోయినప్పుడు అందరూ బాధపడతారు. అది కూడా మనకు తెలియదు. మనకు తెలిసినంత వరకూ మనం సంతోషంగా ఉండి..మనవాళ్లంతా సంతోషంగా ఉండేది పెళ్లిలో మాత్రమే’ అంటూ జయసుధ సినిమా కథేంటో చెప్పేశారు. సో..ఈ సినిమాతో నితిన్, రాశీఖన్నా పెళ్లిలో ఫుల్ సందడి చేయనున్నారన్న మాట. ఆగస్టు9న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో జూలై 22న విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=0zvxjBh1qI0

 

 

 

 

Similar News