సోమారపు ‘రివర్స్ గేర్’

Update: 2018-07-10 15:48 GMT

రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన టీఆర్ఎస్ రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రివర్స్ గేర్ వేశారు. మంత్రి కెటీఆర్ విజ్ణప్తి మేరకు తాను రాజకీయాల ఉపసంహరణ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. మంగళవారం నాడు సోమారపు మంత్రి కెటీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.

రామగుండం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఆపేయాలని అధిష్టానం నుంచి గట్టిగా ఆదేశాలు రాటవం, ఎమ్మెల్యే మాటను కార్పొరేటర్లు పట్టించుకోకపోవటంతో ఆయన నిరసనగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటన చేశారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏమీ చేయలేదని...పార్టీ ఆదేశాల ప్రకారమే ముందుకు సాగుతానని తెలిపారు.

Similar News