ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్..నాగచైతన్య!

Update: 2018-07-13 12:29 GMT

కృష్ణగా మహేష్ బాబు. అక్కినేని నాగేశ్వరరావుగా నాగ చైతన్య. నాగచైతన్య ఇఫ్పటికే ‘మహానటి’ సినిమాలో నాగేశ్వరరావుగా నటించి మెప్పించాడు కూడా. పాత్ర చిన్నదే అయినా..అచ్చం తాతయ్యలాగా యాక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లోనూ ఆయా పాత్రల కోసం వీరిద్దరితోనూ చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాలీవుడ్ టాక్. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహేష్ బాబు, నాగచైతన్య ఇందుకు అంగీకరిస్తారే..లేదో వేచిచూడాల్సిందే. బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతుండగా..ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బసవతారకం పాత్రలో హిందీ హీరోయిన్ విద్యా బాలన్ నటిస్తున్నారు. చంద్రబాబునాయుడి పాత్రను దగ్గుబాటి రానా చేస్తున్నారు. ఇఫ్పటికే భారీ తారాగణంతో ఉన్న ఈ సినిమాలోకి మహేష్ బాబు, నాగచైతన్య కూడా ఎంటర్ అయితే ఇది ఓ రికార్డుగా మారటం ఖాయం.

ఇలా స్టార్ కాస్టింగ్ అంతా ఈ సినిమాలోకి వస్తుండటంతో సినిమాపై అంచనాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. అందుకే కాబోలు ఈ సినిమా విదేశీ హక్కుల కోసం పలువురు పోటీపడుతున్నట్లు టాక్. ఏకంగా విదేశీ హక్కుల కోసం ఓ సంస్థ 13 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. సినీ రంగంలోని ప్రముఖులు చాలా మంది వివిధ రకాల పాత్రల్లో ఈ సినిమాలో దర్శనం ఇవ్వనున్నారు. తొలుత ఈ సినిమాను దర్శకుడు తేజ తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన మధ్యలో వెనక్కితగ్గారు. తర్వాత ఈ బాధ్యతలను బాలకృష్ణతో గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక సినిమాను తెరకెక్కించిన క్రిష్ కే ఈ బాధ్యతలు అప్పగించారు.

 

Similar News