పేరు ఏది అయినా ‘రామ్’ కామన్. మొన్న అభయ్ రామ్..ఇప్పుడు భార్గవ రామ్. ఈ మధ్యే ఎన్టీఆర్ కు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. రెండవ కుమారుడికి ఎన్టీఆర్ నామకరణం చేశారు. అదే భార్గవ రామ్. తొలుత తన తనయుడి ఫోటోను ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలసి ఉన్న ఫోటోను కూడా విడదుల చేశారు. ఈ సమయంలోనే తన కుమారుడి పేరును ప్రకటించారు. ఈ ఫోటోను ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. జైలవకుశ సినిమా హిట్ అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆ సినిమానే అరవింద సమేత రాఘవ. ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.