‘డబ్బుల కోసమే చెత్త సినిమాలు చేశా. జీవనాధారం కోసం తప్పలేదు. కానీ ఇప్పుడు ఇక అలా చేయను. ఎందుకంటే నాకు ఇప్పుడు..డబ్బు..పేరు వచ్చాయి. కొత్త సినిమాలు మాత్రం ఆచితూచి చేస్తున్నా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ రాధికా ఆప్టే. సినిమా రంగంలో బ్యాగ్రౌండ్ ఉంటే తప్ప..రాణించాలంటే చాలా కష్టపడాలని..ఆ కష్టాలు అన్నీ పడినట్లు పేర్కొంది. సినిమా రంగంలో ఎలాంటి చిత్రాల్లో నటించకూడదని భావించానో, డబ్బు కోసం అలాంటి చెత్త చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని పేర్కొంది.
ప్రస్తుతం అన్నీ అంగీకరించడం లేదని, నచ్చిన కథ నచ్చితేనే ఓకే చెబుతున్నా’ అని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఒక దక్షిణాది నటుడు తనను పడకగదికి పిలిచారని సంచలన ఆరోపణలతో ఒక్కసారిగా పెద్ద సంచలనానికి తెరలేపింది రాధికా ఆప్టే. గతంలో విమర్శలకు ఘాటుగా స్పందించిన ఈ భామ తాను కొన్ని సినిమాల్లో హాట్ హాట్ గా నటించినట్లు అంగీకరించింది.