ఏపీ మంత్రి, తెలుగుదేశం నేత నారా లోకేష్ కు ‘స్క్రిప్ట్ రైటర్స్’ లేరా?. విపక్షాలపై డైలాగ్ లకు సినిమాలు కాపీ కొట్టాలా?. మామూలుగా ఏకబిగిన ఓ ఐదు నిమిషాలు ఏ అంశంపై అయినా అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం లోకేష్ కు లేదనే విషయం బహిరంగ రహస్యమే. అందుకే ఆయన బహిరంగ సభల్లో...ఏటా ఆస్తుల ప్రకటన సమయంలో తప్ప...రాజకీయ విమర్శలపై విలేకరుల సమావేశం పెట్టడం అరుదు. అటు...ఇటు వెళుతూ ఏదైనా మాట్లాడినా తాను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోవటం తప్ప..పెద్దగా ప్రశ్నలు..సమాధానాలు ఉండవు. తాజాగా వైసీపీపై విమర్శలు చేసేందుకు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కు చెందిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని డైలాగులను వాడేశారు. అదే బ్రహ్మనందం ‘భాస్కర అవార్డ్స్’. వైసీపీ ఎంపీల రాజీనామాల అంశంపై ట్విట్టర్ వేదికపై స్పందిస్తూ ‘ఏమి నటన. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు భాస్కర అవార్డులకు అర్హులు. ఇవెక్కడివి అంటారా? పవన్ కళ్యాణ్ సినిమాలో ఆస్కార్ తరహాలో తనకు తాను ఇఛ్చుకునేందుకు భాస్కర అవార్డ్స్ పెట్టుకుని ఇచ్చేసుకున్నారు బ్రహ్మనందం.
అచ్చం చంద్రబాబునాయుడు తనకు తాను నిజాయతీపరుడిని...నిప్పును..తప్పులు చేయని సత్యహరిశ్చంద్రుడిని అని చెప్పుకున్నట్లు.. అచ్చం బ్రహ్మనందం కూడా అలాగే చేస్తారు ఆ సినిమాలో. ఇప్పుడు లోకేష్ అదే డైలాగ్ లను వాడేశారు. రాజీనామాల డ్రామాతో వైసీపీ ఎంపీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని లోకేష్ ట్విట్టర్ లో ఆరోపించారు. బిజెపితో కుమ్మక్కు అయి రాజీనామాలపై కాలం వెళ్ళబుచ్చారని..ఇఫ్పుడు ఏడాదిలోపు సమయం ఉంటుంది కాబట్టి..ఉప ఎన్నికలు ఎగ్గొట్టేందుకే ఈ ప్లాన్ వేశారని ఆరోపించారు. వారెవా...వా అంటూ సినిమా డైలాగ్ కొట్టారు ట్విట్టర్ లో. అంతే కాదు..వైసీపీ నేతలు తమ సొంత స్టోరీతో ఏ1, అరడజను దొంగలు పేరుతో ఓ టాలీవుడ్ ఫిల్మ్ కూడా తీసుకోవచ్చని ఎద్దేవా చేశారు.