జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యారు. ఈ సారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ ఈ మధ్యే తన కొడుకు అభయ్ రామ్ పాలు తాగనని మారాం చేస్తుంటే...ప్రణతి ఎలా తాగిస్తుందో చూపే ఓ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ..ఈ విషయంలో నేను రక్షించలేనంటూ సరదాగా ఓ కామెంట్ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.