దుబాయ్-ముంబయ్ మధ్య ఏటా 25 లక్షలు

Update: 2018-06-30 04:37 GMT

దేశంలో అత్యధిక రద్దీ ఉండే అంతర్జాతీయ విమానయాన మార్గం ఏదో తెలుసా?. దుబాయ్-ముంబయ్. ఏటా ఈ మార్గంలో 25 లక్షల మంది ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి. 2017-18 కాలంలో ఈ గణంకాలను సేకరించారు. అదే సమయంలో భారత్ నుంచి అంతర్జాతీయ గమ్యాలకు వెళ్లే సీట్లలో సగం వాటా యుఏఈనే దక్కించుకుంటోంది. ఈ మార్గంలో ఎక్కువ మంది వలస కార్మికులు, మధ్య ప్రాచ్య దేశాల్లోని వ్యాపార మార్కెట్లకు వెళ్ళే పారిశ్రామికవేత్తలు ఉంటారని నివేదికలో పేర్కొన్నారు.

దుబాయ్-ముంబయ్ తోపాటు తర్వాత రద్దీ ఉండే రూట్లలో దుబాయ్-ఢిల్లీ, దుబాయ్-కొచ్చి ఉన్నాయి. ఈ మధ్యే అంతర్జాతీయ ప్రయాణికులకు దుబాయ్ ఓ శుభవార్త ప్రకటించింది. అమెరికా వెళుతూ ట్రాన్సిట్ హాల్ట్ కింద ఆగే ప్రయాణికులకు దుబాయ్ ప్రభుత్వం 48 గంటల ఉచిత వీసా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దుబాయ్ కు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

Similar News