అనారోగ్య వదంతులపై ‘రానా’ వివరణ

Update: 2018-06-19 14:23 GMT

దగ్గుబాటి రానాకు కొత్త చిక్కు వచ్చిపడింది. గత కొన్ని రోజులుగా రానా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని కొన్ని వెబ్ సైట్లలో అడ్డమైన వార్తలు వండి వార్చారు. అవి కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు అటు చేసి..ఇటు చేసి రానా దగ్గరకు వెళ్లాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను ఆరోగ్యంగా..ధృడంగా ఉన్నానని రానా వెల్లడించారు.

తన ఆరోగ్యం విషయంలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని స్పష్టం చేశారు. తాను ఫిట్ గా...పూర్తి శక్తివంతంగా ఉన్నానని తెలిపారు. అయితే బీపీ వంటి సమస్య తప్ప..తనకేమీ ఇబ్బందిలేదని స్పష్టం చేశారు. బీపీ సమస్య కారణంగానే కంటి శస్త్రచికిత్స ఆలశ్యం అవుతుందని రానా తెలిపారు. అయినా రానా తన చేతిలో ఉన్న సినిమాలు అన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Similar News