ప్రభాస్ విడుదల చేసిన ‘నీహారిక’ సినిమా ట్రైలర్

Update: 2018-06-30 13:22 GMT

కొణిదెల నిహారిక. టాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉంది. హిట్ కోసం ప్రయత్నిస్తున్నా..ఇంత వరకూ తలుపుతట్టలేదు. ఇప్పుడు ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా చేస్తోంది. ఈ సినిమాపై నిహారిక భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను బాహుబలి హీరో ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్ కు ముందు నిహారికపై కట్ చేసిన ఓ వీడియో హల్ చల్ సృష్టించిన సంగతి తెలిసిందే. హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో నిహారికకు జోడీగా నిర్మాత ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా చేస్తుంటే.. ఈ సినిమాకు లక్ష్మణ్ కర్య దర్శకుడుగా ఉన్నారు. యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఫిదా ఫేం శక్తికాంత్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=li75rrZ2-ro

Similar News