కె ఈ పై చంద్రబాబుపై ఫైర్

Update: 2018-06-20 04:37 GMT

నాయీ బ్రాహ్మణులపై సెక్రటేరియట్ నడిరోడ్డు మీద ఇష్టానుసారం కేకలు వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఫెయిల్యూర్ ను ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తిపైకి తోసేశారు. మంగళవారం నాడే చంద్రబాబు నాయీ బ్రాహ్మణుల సమస్యను సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని..అందుకే సమస్యలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడిలోని నాయీ బ్రాహ్మణుల సమస్యను మీరే పరిష్కరించి ఉంటే..సమస్య ఇంతలా మారేదికాదని...ఇప్పుడు అది పెద్ద వివాదంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపి నేత మాణిక్యాలరావు రాజీనామా చేసిన తర్వాత కె ఈకి అదనంగా దేవాదాయ శాఖను కూడా అప్పగించిన సంగతి తెలిసిందే. సీఎం తీరుపై కె ఈ కృష్ణమూర్తే గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆయన ఈ విషయాన్ని అయినా సీరియస్ గా తీసుకోకుండా..సీఎంకే వదిలేసినట్లు చెబుతున్నారు. అన్ని విషయాల్లో చంద్రబాబు, లోకేష్ లే పరిష్కరించకుంటుంటే తాము ఎందుకు జోక్యం చేసుకోవాలనే ధోరణిలో ఉన్నారని చెబుతున్నారు.

 

Similar News