ఆరోపణలకూ ‘అర్హతలు’ ఫిక్స్ చేసిన చంద్రబాబు

Update: 2018-06-10 04:19 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అవినీతి కార్యక్రమాల నుంచి తనను తాను రక్షించుకునేందుకు కొత్త లాజిక్ ను తెరపైకి తెచ్చారు. సో...ఆయన రాబోయే రోజుల్లో ఇంకా చెలరేగిపోవచ్చన్న మాట. ఎవరైనా ఆధారాలతో సహా ఆరోపణలు చేసినా..చేతనైతే కేసులు వేసుకోండి అని సర్కారు తరపున ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు సవాళ్లు విసురుతున్నారు. ఎవరైనా ధైర్యం చేసి కోర్టుకు వెళితే ఇదే చంద్రబాబు అండ్ టీమ్ అభివృద్ధిని అడ్డుకున్నారు... ప్రాజెక్టులు ఆపేస్తున్నారు అని గగ్గోలు పెడతారు. కోర్టులకు వెళ్లి ప్రాజెక్టులు..రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నారని ఎదురుదాడి చేస్తారు. ఓ వైపు ఏపీలో వేల కోట్ల రూపాయల దోపిడీ సాగుతున్నా...చంద్రబాబు తనకు తాను అసలు అవినీతే లేదు...నేను నిప్పు అని స్వీయ సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటారు. ఓ వైపు సాక్ష్యాత్తూ కడప టీడీపీ నేత వరదరాజులు రెడ్డి స్వయంగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీ ఎం రమేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

ప్రాజెక్టుల పేరుతో దోచుకుని కడపలో రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు తనపై వచ్చే అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు తెచ్చిన లాజిక్ ఎలా ఉందో ఓ సారి చూడండి. ‘జగన్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డి అవినీతి కేసుల్లో ముద్దాయిలే కదా?. అవి నిరూపితమైన కేసులే కదా?. అలాంటి వాళ్లు మాపై అలాంటి ఆరోపణలు చేయటం ఏంటి?’ అన్నది చంద్రబాబు ప్రశ్న. అంటే అవినీతి ఆరోపణలు ఉన్న వారు ఎవరూ చంద్రబాబు అవినీతిని ప్రశ్నించకూడదు అట. ఆహా ఏమి లాజిక్..స్ట్రాటజీ..ప్లానింగ్. ఈ పేరు చెప్పి ఇక చంద్రబాబు ఇష్టానుసారం దోచేసుకోవచ్చన్న మాట. బాగుంది ప్లాన్. పోనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైనా అవినీతి అని అంటే..నిన్నటి దాకా పొగిడావు..ఇప్పుడు తిడతానంటే కుదరదు ‘తూచ్’ అనేస్తున్నారు. బాగుంది చంద్రబాబు స్కీమ్.

 

Similar News