సెక్స్ రాకెట్..ఎఫ్ బిఐ పోలీసుల ఎదుట చంద్రబాబు సన్నిహితుడు!

Update: 2018-06-20 06:47 GMT

అమెరికాలో సెక్స్ రాకెట్. తెలుగు రాష్ట్రాల్లో కలకలం. ముఖ్యంగా ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ. సినీ పరిశ్రమతోపాటు తానాలోనూ సినీ హీరోయిన్ల సెక్స్ రాకెట్ కు సంబంధించి కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత అధ్యక్షుడు వేమన సతీష్ ను అమెరికా పోలీసులు ఇదే అంశంపై నాలుగైదు సార్లు విచారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వేమన సతీష్ తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగానే ఉంటారు. కొంత మంది హీరోయిన్లను అమెరికా తీసుకెళ్ళటంతోపాటు...అక్కడ కార్యకలాపాల నిర్వహణ విషయంలో వేమన సతీష్ పేరు కూడా ఉండటంతో పోలీసులు ఈ విషయంలో ఆయన నుంచి సమాచారం తీసుకునే క్రమంలో ఇప్పటికే ఐదుసార్లు ఎఫ్ బిఐ పోలీసులు వేమన సతీష్ ను పిలిచినట్లు సమాచారం.

ఈ విషయంలో తానాకు చెందిన పలువురు ప్రముఖులు కూడా చిక్కుకునే సూచనలు కన్పిస్తున్నాయి. అందుకే ఈ సంఘంలో ఉన్న చాలా మంది నాయకులు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు..సెక్స్ రాకెట్ కు సంబంధించి వెలుగు చూసిన డైరీలో ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పేరు కూడా ఉంది. అంతే కాదు....సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ పేరు కూడా అందులో ఉంది. తీగలాగితే డొంకంత కదులుతున్నట్లు పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో అమెరికా తెలుగు సంఘంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఎవరి పేరు ఎక్కడ నుంచి బయటికి వచ్చి పరువు పోతుందో అన్న చందంగా తానా నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు.

నాట్స్ అయితే మాత్రం తమకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. సెక్స్ రాకెట్ కు సంబందించిన వ్యవహారంలో చాలా మంది నేతల పేర్లు ఉన్నాయి. త్వరలోనే అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆ సెక్స్ రాకెట్ నిర్వహించిన దంపతులను పోలీసులు విచారించగా వారి డైరీ ద్వారా అందిన సమాచారం ప్రకారం కేవలం వారిద్దరూ మాత్రమే ఇప్పటివరకూ చేసిన చీకటి సెక్స్ వ్యాపారం దాదాపు ఆరు మిలియన్ డాలర్లు, అంటే సుమారు అక్షరాల 40 కోట్ల రూపాయిలని ఎఫ్ బీ ఐ పోలీసులు నిర్ధారించినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు చాలామంది తెలుగు ప్రముఖులు మీడియా సంస్థల పెద్దల పేర్లు కూడా వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Similar News