వైసీపీలో చేరిన టీడీపీ నేత

Update: 2018-05-10 06:57 GMT

ఏపీలో ప్రతిపక్ష వైసీపీలోకి టీడీపీ నేతల చేరిక కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్ యలమంచిలి రవి, కన్నబాబు తదితరులు ఆ పార్టీలో చేరారు. ప్రస్తుతం అత్యంత కీలకమైన కృష్ణా జిల్లా నుంచే మరో చేరిక చోటుచేసుకుంది. మైలవరానికి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్‌ గురువారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో వసంత కృష్ణప్రసాద్‌ సహా వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వారందరికీ జగన్‌ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేస్తామని వసంత నాగేశ్వరరావు, కృష్ణప్రసాద్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. వసంత నాగేశ్వరరావు గతంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో హోం మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వసంత ఫ్యామిలీ వైసీపీలోకి చేరటం ఆ పార్టీకి రాజకీయం కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Similar News