ఇదెక్కడి విచిత్రం అనుకుంటున్నారా?. కానీ నిజం. ఆ ప్రయాణికుడి పేరు చాలా ఎక్కువగా ఉందని థాయ్ ఎయిర్ వేస్ అదనపు ఛార్జీ వసులు చేసిందట. ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. నిజమే కదా..పేరు ఎక్కువ ఉంటే అదనపు ఛార్జీ ఎలా వసూలు చేస్తారు?. థాయ్ ఎయిర్ వేస్ ప్రయాణికుడు చెక్ ఇన్ అయిన తర్వాత పాస్ పోర్టులో పేరుకు...టిక్కెట్ పై పేరుకు పొంతనలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.అయితే ప్రయాణికుడి వాదన మరోలా ఉంది.
థాయ్ ఎయిర్ వెబ్ వెబ్ సైట్ లో క్యారెక్టర్ లిమిట్ పరిమితంగా ఉండటం వల్ల తన చివరి పేరును పూర్తి స్థాయిలో రాయలేకపోయినట్లు చెబుతున్నారు. చివరకు తప్పు తెలుసుకున్న థాయ్ ఎయిర్ వేస్ ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పటంతో పాటు..అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని కూడా రీఎంబర్స్ చేసింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయినా పేరు చాలా ఎక్కువగా ఉందని అదనపు మొత్తం వసూలు చేసిన ఈ సంఘటన అందరినీ నవ్విస్తోంది.