ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమాన రూట్ ఏదో తెలుసా?. అది సింగపూర్-మలేషియా రాజధాని కౌలాలంపూర్ మార్గమే. ఓ పరిశోధనలో ఈ విషయం తేలింది. గతంలో హాంకాంగ్-తాపే రూటు ప్రధమ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఈ చోటును సింగపూర్-కౌలాలంపూర్ లు ఆక్రమించాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం కేవలం గంట మాత్రమే. సగటున సింగపూర్-కౌలాలంపూర్ ల మధ్య రోజుకు 84 ట్రిప్పులు నడుస్తున్నాయి.
ఈ మార్గంలో పలు బడ్జెట్ ఎయిర్ లైన్స్ స్కూట్, జెట్ స్టార్, ఏయిర్ ఏషియా, మలిండో ఎయిర్ లు తమ సర్వీసులు నడుపుతాయి. ఓఏజీ ఏవియేషన్ వరల్డ్ వైట్ పరిశోధనలో ఈ విషయాలు తేలాయి. ఈ మార్గం తర్వాత అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ రూట్ న్యూయార్క్-టోరంటో మార్గాలు ఉన్నాయి. అయితే ప్రయాణికుల విషయానికి వస్తే హాంకాంగ్, తైవానీస్ క్యాపిటల్ అగ్రస్థానంలో ఉన్నాయి.